అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుచేసుకున్న పవన్

 

తిత్లీ తుఫాన్ తో శ్రీకాకుళం జిల్లా భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.తుఫాన్ అయితే బీభత్సవం సృష్టించింది వెళ్ళిందిగాని దీనిపై ఇంకా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దాలు నడుస్తూనే ఉన్నాయి.ఇటీవల భాదితులకు పరిహారం ఇవ్వటానికి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నువ్వు కేంద్రానికి లేఖ అయినా రాశావా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు.అయితే దీనికి ప్రతిగా ఇదిగో సాక్ష్యం అంటూ లేఖని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ధీటుగా సమాధానం చెప్పారు.ఇప్పుడు ఆ పరిహారం ఇవ్వటమే చర్చగా మారింది.'తిత్లీ తుఫాన్ భాదితులకు ఆంధ్రప్రేదేశ్ ప్రభుత్వం కొండత అండ' అనే పోస్టర్లు బస్సులపై కనపడుతున్నాయి.దీన్ని గమనించిన పవన్ తిత్లీ తుఫాన్‌ సహాయాన్ని కూడా ఎపీ ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం తగదని మండిపడ్డారు.ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. 'తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.. కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుకు వస్తుంది' అని పవన్‌ పోస్ట్‌ చేశారు.దీనిపై ఏపీ ప్రభుత్వం,చంద్రబాబు నాయుడు,మంత్రులు ఎలా స్పందిస్తారో?

మరో ట్వీట్ లో కార్తీకమాసంలో జరుపుకునే వనభోజనాలపై స్పందించారు."జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి. కానీ, నా పేరు మీద కానీ, జనసేన పార్టీ పేరు మీద కానీ జరపద్దని నా మనవి" , "ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు, తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు" అంటూ పవన్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.