మరోసారి రెచ్చిపోయిన పాక్..

 

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్ లోని బందీపోరా జిల్లాలో ఆర్మీ జవాన్లను లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడగా వారని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో కూడా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. గుల్పురా ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఉదయం నుంచి పాక్‌ రేంజర్లు జరుపుతున్న కాల్పుల్లో భార్యాభర్తలు మృతిచెందారు. వారి చిన్నారులు గాయపడ్డారు. కాగా.. మృతిచెందిన వ్యక్తి భారత జవాను అని ప్రాథమిక సమాచారం. అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుకాల్పులు చేపట్టి పాక్‌ సైన్యానికి దీటుగా బదులిస్తున్నారు.