ఔటర్ పై ప్రమాదం... మెడికో మృతి

 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎప్పుడూ యాక్సిడెంట్ లు జరుగుతూనే ఉంటాయి. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వైద్య విద్యార్దులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ విద్యార్ధులు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో లారీ విద్యార్ధులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్య విద్యార్ధులు సంగారెడ్డిలోని ఎంఎస్ఆర్ వైద్య కళాశాలకు చెందినవారు.