30 మంది నర్సులకు అస్వస్థత

 

హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలలో నర్సింగ్ విద్యార్థులుగా వున్న 30 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ జరిగిన కారణంగా వీరు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం. విద్యార్థినులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్‌ వంటగదిలో అపరిశుభ్రత, పాత్రలు సరిగా శుభ్రం చేయకపోవడం, కుళ్లిన కూరగాయలతో వంట వండుతూ వుండడం... ఇలాంటి కారణాల వల్లే ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని నర్సింగ్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.