నవాజ్ పాక్ సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం!

 

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చింది. గతంలో పనామా పేపర్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పనామా పేపర్స్ లో నవాజ్ షరీఫ్ పేరు కూడా ఉంది. దీంతో అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసును విచారించిన కోర్టు..  గత ఏడాది ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు..దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. అంతేకాదు ఎలాంటి బహిరంగ సభల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశించింది. ఈయనతో పాటు పాకిస్థానీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్ పై కూడా జీవితకాల నిషేధం విధించింది. ఆయన కూడా ఎలాంటి పదవులు చేపట్టకూడదని ఆదేశించింది.