నా మీద వేటు..పెద్ద జోక్..

 


పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆ దేశ సుప్రీం కోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. పనామా పేపర్స్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షరీఫ్ పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. అయితే ఇప్పుడు తనపై వేసిన వేటును జోక్ గా అభివర్ణించారు నవాజ్ షరీఫ్. ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు బయలుదేరిన ఆయన మూడో రోజు గుజరాత్‌ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనపై అనర్హత వేటు వేసిన న్యాయమూర్తులు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోయారన్నారు. ఈ జోక్‌ను తాను అంగీకరించడం లేదని, మీరు ఎన్నుకున్న వ్యక్తిని అవమానించి పంపిస్తే మీరు అంగీకరిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. అసలు తనను ఎందుకు తొలగించారని, తానేమైనా అవినీతికి పాల్పడ్డానా? అని షరీఫ్ నిలదీశారు.