శిల్పా మోహన్ రెడ్డికి పెద్ద షాక్.. ముఖ్యఅనుచరుడు టీడీపీలోకి..

 

నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఉపఎన్నిక పోరు సంగతేమో కానీ.. రెండు పార్టీల మధ్య మాటల యుద్దం మామూలుగా లేదు. సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా ఇలాంటి వాతావరణం చూసి ఉండవేమో. ఇక తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి రెండు పార్టీలు ఎవరి వ్యూహాలు వాళ్లు రచించుకుంటున్నారు. ఇప్పుడు  వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. గత 15 సంవత్సరాలుగా ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న మైనార్టీ నేత కరీం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేషనల్ విద్యాసంస్థల ఛైర్మన్ గా, నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, మైనార్టీ నేతగా ఆయనకు మంచి పేరుంది.