నాగాలాండ్‌పై ఉగ్రవాదుల పంజా..సైనికుడి మృతి

గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఈశాన్య భారతంపై ఉగ్రవాదులు పంజా విసిరారు. నాగాలాండ్‌లోని మౌ ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా బలగాలపైకి దాడులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన జవాన్లు ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాగా ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి, పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు ముష్కరులు హతమైనట్లు సమాచారం. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, యూనైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు దాడికి దిగినట్లుగా సమాచారం.