కేంద్ర హోంశాఖలో చిచ్చు

 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల స్వచ్చంధ పదవీ విరమణ చేసిన సంగతి తెలసిందే. దానికి కేంద్ర కూడా ఆమోదం తెలిపింది.  అయితే ఇది ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసిందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గోయల్ స్వచ్చంధ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రధాన నరేంద్ర మోడీ రాజీవ్ మెహ్రిషీని నియమించారు.. అది కూడా రాజ్‌నాథ్ సింగ్‌కు తెలియకుండానే చేశారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది.

 

మరోవైపు హోంశాఖ అదనపు కార్యదర్శి అనంత్‌ కుమార్‌ సింగ్‌ను పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా నియమించారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చనువుగా ఉండటమే అనంత్‌కుమార్‌ బదిలీకి కారణమని తెలుస్తోంది. ఎందుకంటే గోయల్ కు అనంత్ కుమార్ కు మధ్య సఖ్యత లేకపోవడం.. కూడా ఓ కారణం.. అంతేకాదు గోయల్ తీరుపై హోంమంత్రి కూడా అసంతృప్తిగా ఉండేవారిని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. ప్రధాని మోడీ దృష్టికి ఇద్దరినీ ఆ శాఖ నుంచి తప్పించి, ఇతర అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేశారని పేర్కొంటున్నాయి.

 

కాగా.. ఈ బదిలీలతో ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వానికి అనుగుణంగా పని చేయకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని మోడీ ఈ బదిలీల ద్వారా తెలిపారని అధికారులు భావిస్తున్నారు.