ఒక్కరోజులో మావోయిస్ట్ ల కలకలం.

ఒకేసారి పలు సందర్బాల్లో మావోయిస్టులు అరెస్ట్, ఎన్ కౌంటర్లతో కలకలం రేగింది. చాలా రోజుల తరువాత మళ్లీ చత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం 15 మంది మావోలు చనిపోగా వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులను మావోలు కిడ్నాప్ చేయడం. ఖమ్మం జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నాయకులును కిడ్నాప్ చేసి అనంతరం మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట తమ డిమాండ్లతో ఒక లేఖను రాశారు. అందులో
1). వరంగల్ జిల్లాలో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
2). ఖమ్మం జిల్లా నుంచి అదిలాబాద్ వరకూ నిర్వహిస్తున్న కూంబింగ్ ను నిలిపివేయాలి.
3). ఎన్ కౌంటర్ పేరిట హత్యల్ని ఆపేయాలని లేదంటే.. టీఆర్ ఎస్ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన కొంత సేపటికి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మావోయిస్ట్ సానుభూతి పరులంటూ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు కొత్తగూడెం ఓఎస్డీ కార్యాలయానికి తరలించారు.

మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ జనార్ధన్ ఉరఫ్ ఐతు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన  వరంగల్ జిల్లా పోలీసుల వద్ద లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ లో దశాబ్ద కాలం పాటు పని చేసిన ఇతను లొంగిపోవటం మావోలకు తీరని లోటుగా చెబుతున్నారు. ఇతని పేరు మీద రూ.20లక్షల రివార్డు ఉంది.