మనోజ్ సంగీత్ లో రజనీకాంత్ స్టెప్పులు

 

మంచువారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ పెళ్లికి మొహన్ బాబు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులందరిని ఆహ్వానించారు. దాదాపు 5 రోజుల పాటు సంగీత్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం వారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సంగీత్ లో స్పెషల్ ఏంటంటే మంచు మనోజ్ సంగీత్ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, కన్నడ నటుడు అంబరీశ్ లు కూడా స్టెప్పులు వేయనున్నారట. శంషాబాద్ లోని మోహన్ బాబు నివాసంలో ఈ వేడుకకు వేదిక కానుంది. మనోజ్ సోదరి మంచు లక్ష్మీనే ఈ కార్యక్రమాలన్నింటికి యాంకరింగ్ చేయనున్నారట.