నోట్లపై గాంధీని ముద్రించడం మరచిపోయారట

రూ.5 నోటు నుంచి రూ. 2000 నోటు వరకు జాతిపిత మహాత్మాగాంధీ లేకుండా ఊహించుకోలేము..అలాంటిది గాంధీ బొమ్మ లేకుండా నోట్లు వస్తే..కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. గోవర్ధన్ శర్మ అనే వ్యక్తి మోరేనాలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. తీరా డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తిన్నాడు. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో సెక్యూరిటీ గార్డుకు విషయం చెప్పాడు. అతని సహకారంతో హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయడంతో అధికారులు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కావని, ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరచిపోయారని వివరణ ఇచ్చారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంక్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు.