మేడారం జాతర జరిగే తేదీలు ఇవే

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు మళ్లీ సమయం వచ్చేసింది. గిరిజన సాంప్రదాయ రీతుల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో అమ్మవార్లను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారంకు పోటెత్తుతారు. 2018లో జరగనున్న మేడారం జాతర తేదీల వివరాలను ఆలయ పూజారులు ప్రకటించారు.

 

* జనవరి 31న.. సారలమ్మ గద్దెకు వస్తుంది
* ఫిబ్రవరి 1న.. సమ్మక్క గద్దెకు వస్తుంది
* ఫిబ్రవరి 2న.. భక్తులు మొక్కుల చెల్లింపు
* ఫిబ్రవరి 3న.. సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేస్తారు