హోదా ఉద్యమంపై రోశయ్య...ఇప్పుడు చేస్తున్నది చాలదు...

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఉద్యమంపై మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మొదటిసారి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలంటే, ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు, తెలుపుతున్న నిరసనలు సరిపోవని... హోదా ఉద్యమాన్ని ఎవరూ ఊహించనంత ఉద్ధృత స్థాయికి తీసుకు వెళితేనే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు నరేంద్ర మోదీ కట్టుబడి ఉండాలని హితవు పలికారు.