చెవులు కొరుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు



కొణతాల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వి.ఏ.సీ. సభ్వత్వానికి రాజీనామా చేశారు. అయితే కొణతాల ఇప్పటికీ తమ పార్టీ నేతే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ చెబుతున్నారు. ఆయన రాజీనామా సమాచారం తమకి అందలేదని.. ఆయన పార్టీని వీడి వెళ్ళరనే నమ్ముతున్నానని చెప్పారు. ఆ పార్టీ ఇతర నాయకులు కూడా కొణతాల రాజీనామా తమ పార్టీ అంతర్గత విషయం అని.. త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పెందుర్తి ఇన్ ఛార్జీ పదవి నుంచి తప్పించటంపై కొణతాల మనస్తాపం చెంది.. రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. పార్టీలో మార్పులు చేర్పులు సహజం అని... అంత దానికే ఇంత పెద్ద నిర్ణయాలు అవసరమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు చెవులు కొరుకుంటున్నారు.