జైపాల్ రెడ్డిని సీఎం కావాలని కోరిన కేసీఆర్..!

 

కేసీఆర్ ఏంటి.. జైపాల్ రెడ్డిని సీఎం కావాలని కోరడం ఏంటని షాక్ అవుతున్నారా?.. అది ఇప్పటి మాట కాదులేండి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం నాటి మాట.. అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ తాజాగా జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.. 'తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌లేకపోయాం.. అంతేకాదు, తెలంగాణ బిల్లు పాస్ చేసే విష‌యంలో తాను చేసిన సాయం కూడా కేసీఆర్ ఖాతాలో ప‌డిపోయింద‌నీ, ఉద్య‌మం ఎవ‌రు చేసినా ఆ బ్రాండ్ నేమ్ మాత్రం కేసీఆర్ కు వచ్చిందని జైపాల్ అన్నారట..

తన‌ను కొత్త రాష్ట్రానికి సీఎం చేస్తార‌నే ప్ర‌తిపాద‌న కూడా అప్ప‌ట్లో వచ్చింది.. ఇదే విష‌యాన్ని నాడు కేసీఆర్ త‌న‌తో మాట్లాడార‌నీ, తెలంగాణ రావ‌డానికి తాను చేసిన సాయాన్ని కేసీఆర్ మెచ్చుకుంటూనే, బ్రాండ్ ఇమేజ్ మాత్రం త‌న‌కే ద‌క్కాల‌న్నార‌ని గుర్తు చేసుకున్నారు.. 'మీరే ముఖ్య‌మంత్రి కావాల‌ని కేసీఆర్ అన్నారు.. నేను కాదు మీరైతేనే బాగుంటుంద‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌తిస్పందించాను' కానీ, త‌రువాత కేసీఆర్ ఆ విష‌యాన్ని మ‌ర‌చిపోయారు అని జైపాల్ రెడ్డి అన్నట్టు తెలుస్తుంది.