చిత్తూర్ ఎంపీగా పోటీ చేయనున్న మహేష్?

 

కత్తి మహేష్.. తెలుగు రాష్ట్రాల యువతకు, ముఖ్యంగా సోషల్ మీడియా యువతకు బాగా సుపరిచితులు.. పేరుకి క్రిటిక్ అయినా, కాంట్రవర్సీలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు.. అప్పుడప్పుడు రాజకీయ విశ్లేషణ, రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసే కత్తి మహేష్, ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.. తాజాగా ఈ విషయంపై స్పందించిన మహేష్, తన మనస్సులో మాట బయటపెట్టారు..

2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీ తరుపున పోటీ చేసేది త్వరలోనే ప్రకటిస్తానని మహేష్ అన్నారు.. మహేష్ టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేసారు.. దాంతో వైసీపీ తరుపున పోటీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఒకవేళ వైసీపీ తరుపున కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలనే ఆలోచనలో కత్తి మహేష్ ఉన్నట్టు తెలుస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu