తెరాస లో అసంతృప్తి సెగ..

కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేసి ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాలని అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి విదితమే. ఇప్పటికే  కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే టికెట్ వస్తుందని ఆశించిన కొందరు ఆశావహులు జాబితపట్ల అసంతృప్తి వ్యకతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ కోసం ఇతర పార్టీలను ఆశ్రయిస్తున్నారని సమాచారం.

 

మాజీ మంత్రి - ప్రస్తుత సీనియర్ టీఆర్ ఎస్ నేత జీ. గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తాను రేవంత్ రెడ్డిపై పోటీచేస్తానని,కోడంగల్ టికెట్ ఇవ్వాలని కోరినా తనకు టీఆర్ ఎస్ టికెట్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ లో చేరతానని, కోడంగల్ ఎలాగూ రేవంత్ రెడ్డి ఉండడంతో తనకు తాండూర్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తనకు టీఆర్ ఎస్ టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెంది రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి జైలుకు వెళ్లిన తనను టీఆర్ ఎస్ నిర్లక్ష్యం చేసిందని.. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదని.. అందుకే ఆ పార్టీ వీడుతున్నట్టు ఆరోపించారు. ఇటీవలే టీఆర్ ఎస్ పై తిరుగుబాటు చేసిన కొండా సురేఖ కూడా కాంగ్రెస్ లో చేరి వరంగల్ తూర్పునుంచి బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారట. గులాబీ దళంలో గుబులు పుట్టుస్తున్న వారిని కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారో వేచిచూడాల్సిందే..