బీజేపీ ఆఫర్...జేడీఎస్ లో చీలికలు..

 

కర్ణాటక ఎన్నికల్లో ప్రస్తుతం అయితే హంగ్ ఏర్పడింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో మంతనాలు మొదలెట్టేశారు. ఇప్పటికే జేడీఎస్ తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు కుమార స్వామిని ముక్యమంత్రిగా చేసేందుకు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసింది. ఇదిలా ఉండగా బీజేపీ కూడా రంగంలోకి దిగి ఎలాగైన అధికారం చేపట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే  బీజేపీ దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు జేడీఎస్ లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీలికను అడ్డుకునేందుకు దేవెగౌడ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోపక్క బీజేపీని అడ్డుకోవడానికి విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే మాయావతి, మమతా బెనర్జీ జేడీఎస్ నేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది.