బాబోయ్ 100 రోజుల ట్రయిలర్ కే తట్టుకోలేక పోతున్నాం: మోడీకి కాంగ్రెస్ పంచ్

 

రెండో సారి వరుసగా అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తన తొలి 100 రోజుల పాలన  పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ గత ఐదేళ్ల కంటే ఇప్పుడు మరింత వేగంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఈ 100 రోజుల్లో ఎంతో సాధించామని.. ఐతే ఇది కేవలం ట్రైలరే మాత్రమే అని అసలైన సినిమా ముందుందని తెలిపారు. తాజాగా మోడీ వ్యాఖ్యల పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ వంద రోజుల ట్రయిలర్ కే  దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోందని, ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోయాయని, ఉద్యోగాలపై తీవ్ర ఆందోళన నెలకొందని, దేశం ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతోందని అన్నారు. ట్రైలర్ లోనే ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారైతే ఇక సినిమా మొత్తం ముగిసేటప్పటికి దేశం దివాళా తీసేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మోదీ అబద్ధాలతో ఉండే సినిమాను తాను చూడదలుచుకోలేదని అన్నారు.