ప్యాకేజ్ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారు...


ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారో లేదో అప్పుడే కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై తొలిసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం ఈరోజు జరిగింది.  ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే భయపడటం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జతకడుతుందని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై  పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని అన్నారు.