నేను సీఎం అయితే తొలి సంతకం ఆ ఫైల్ పైనే...

 

కమల్ హాసన్ ఇటీవలే రాజకీయ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తన పార్టీకి మక్కళ్ నీది మయ్యమ్ అనే పేరు కూడా పెట్టారు. అయితే నిన్న పొన్నేరిలో ఓ కాలేజీకి వెళ్లిన ఆయన విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....విద్యార్థులు రాజకీయాల గురించి తెలుసుకోవాలే గానీ రాజకీయ వేత్తల మాదిరిగా మారిపోరాదని ఆయన సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుతో మంచి నేతలను ఎన్నుకోవాలని కమల్ కోరారు. అంతేకాదు..  దక్షిణ భారతదేశంలో అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లేని ఏకైక రాష్ట్రం తమిళనాడు అని.. భవిష్యత్తులో ఏ ఒక్క అవినీతి రాజకీయ నాయకుడూ అధికారం చేపట్టకుండా చేయాలంటే లోకాయుక్త అవసరమని.. తాను కనుక సీఎంనైతే తన తొలి సంతకం లోకాయుక్త ఫైలుపైనే చేస్తానని చెప్పారు.