జగన్ కు పొగరు... అందుకే టీడీపీలో చేరా...

 

ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తాను టీడీపీలోకి ఎందుకు చేరానన్నదానిపై వివరిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా సీటు గెలవడమే లక్ష్యంగా మాత్రం తెలుగుదేశంలో చేరలేదని.. తాను పార్టీ మారడానికి జగనే కారణమని అన్నారు. జగన్ కు పొగరు ఎక్కువని, అది ఉండాల్సిన పొగరు కన్నా ఎంతో ఎక్కువని.. వైఖరి అత్యంత ప్రమాదం కాబట్టే, తాను ఎన్నికలకు ముందే తెలుగుదేశంలో చేరిపోయానని అన్నారు.  అంతేకాదు రాయలసీమ రైతులకు సాగు, తాగు నీటిని అందిస్తే, 2019లో సైతం చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.