తమిళనాడులో జల్లికట్టు..

 


జలికట్టు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సైతం పక్కన పెట్టి తమిళనాడులో జల్లికట్టును నిర్వహించారు. తమిళనాడులోని పలమేడు గ్రామం జల్లికట్టు క్రీడతో అలరారుతోంది. ఎద్దులకు పూజలు నిర్వహించి యువకులు జల్లికట్టు క్రీడలో పాల్గొంటున్నారు. ఎద్దులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జల్లికట్టు ఆడుతున్నారు. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.