వాట్ జగన్.. వాట్ ఈజ్ దిస్ జగన్..

 

చిన్న పిల్లోడు చాక్లెట్ అడిగినా నన్ను సీఎం చేయండి.. నేను అధికారంలోకి వచ్చిన తరువాత చాక్లెట్ కొనిస్తాను అనేలా ఉన్నాడు జగన్. ఎందుకంటే... ఎవరేం అడిగినా దానిని సీఎం పదవికి లింకు పెట్టి.. నన్ను సీఎం చేయండి అని అడుగుతున్నాడు. ఏదో పెద్ద పెద్ద పనులు అయితే ఆయన చేయడానికి కుదరదు.. అని అనుకోవచ్చు.. కానీ చిన్న చిన్నసాయాలకు కూడా జగన్ ఇలా పదవిని అడ్డుపెట్టడం మూర్ఖత్వం అనిపిస్తోంది. దీనికి తాజాగా జరిగిన  ఘటన ఉదాహరణ చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పాదయాత్ర అంటూ బయలుదేరిన సంగతి తెలిసిందే కదా. ఈ పాదయాత్రలో భాగంగా ఓ అవ్వ.. తనకు ఎవరూ లేరని, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నానని, తనను ఆదుకోవాలని జగన్‌ను కోరిందట. దానికి జగన్ గారు ఏం చేశారో తెలుసా..  రాష్ట్రంలో ఎవరూ లేని అనాథలు, వృద్ధులు స్వచ్ఛందంగా ఎక్కడైనా ఉండాలనుకునే వారిని తాను అధికారంలోకి వస్తే ఆదుకుంటానని... ఇందుకోసం ఏడాది ఓపిక పట్టాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కట్టడానికి మరో ఏడాదిన్నర సమయం కావాలని అన్నాడు. ఇక జగన్ చెప్పిన ఈ ఆన్సర్ కి అవ్వ మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి ఇంత చిన్న సాయానికి కూడా జగన్ కు సీఎం పదవి కావాలా. ఇక్కడే చంద్రబాబుకి జగన్ కు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబును ఓ వృద్దురాలు కలిసి తనకు ఎవరూ లేరని.. ఇల్లు కూడా లేదని.. ఆదుకోవాలని చంద్రబాబును అడిగితే.. కొన్ని గంటల్లోనే ఆమె ఉండటానికి ఓ ఫ్లాట్ ను అవసరాల కోసం కొంత డబ్బును ఏర్పాటు చేశారు.

 

అసలు జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్టు.. ? జనాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరించడానికే కదా. అలాంటప్పుడు ఇలాంటి వారికి సహాయం చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. పైగా ఇదేమీ జగన్ అధికారంలో లేకుండా చేయలేని పనులు కాదు. కనీసం ఇలా సాయం చేసైనా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేయకుండా... ఎంతసేపు..ఏదో చిన్న పిల్లాడు ఏదన్నా తాయిలం పెడితేనే పని చేస్తా అన్నట్టు.. నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి.. నేను అప్పుడు చేస్తా అంటుంటే.. అది జగన్ అమాయకత్వం అనుకోవాలో..? లేక..? అహంకారం అనుకోవాలో తెలియని పరిస్థితి. మరి ఆ మాత్రం సాయం చేయనప్పుడు ఇంకా పాదయాత్రలు చేయడం ఎందుకో. అడిగిన సాయం చేయకుండా... మాటలు చెబితే సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నాడేమో..? వాట్ జగన్.. వాట్ ఈజ్ దిస్ జగన్..