విరామ సమయం.. భారత్ స్కోర్ 130/0

 

భారత్‌-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. పల్లెకలె లో జరుగుతున్న ఈ టెస్ట్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ కు దిగిన భారత్ మొదట కాస్త తడబడినా.. ఆతరువాత కుదురుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శన భారత్‌కి కలిసొచ్చింది. తొలి సెషన్‌లోనే ఇద్దరు ఓపెనర్లు ఇచ్చిన క్యాచ్‌లను శ్రీలంక ఆటగాళ్లు అందుకోలేకపోయారు. ఇక తృటిలో ఔటయ్యే ప్రమదం నుంచి తప్పించుకున్న ధావన్‌, రాహుల్‌ లు తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.  పోటాపోటీగా బౌండరీలు బాదుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం విరామ సమయానికి భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 134 పరుగులు చేసింది.

 

కాగా ఈ మ్యాచ్ లో రెండు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. సస్పెన్షన్ కు గురైన జడేజా స్థానంలో బౌలర్ కుల్ దీప్ యాదవ్ కు చోటుదక్కింది. ఇంకా శ్రీలంక జట్టులో మూడు మార్పులు జరిగాయి. లక్ష్మణ్ సందాకన్, కుమారా, ఫెర్నాండో తుది జట్టుకి ఎంపికయ్యారు.