ఐసీఐసీఐ అకౌంట్ ఉందా..ఐతే బంపరాఫర్ కొట్టినట్లే..!
posted on Jul 20, 2017 5:02PM

మనకు ఏదైనా లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి..అదొక్కటేనా ష్యూరిటీలు, ఆస్తుల తాకట్టు, పే స్లిప్పులు, ఆ స్లిప్పులు అంటూ వంద రకాల పేపర్స్ అప్పగిస్తే కానీ బ్యాంకుల్లో రుణాలు మంజూరుకావు. ఇవేవి చేయలేక చాలా మంది మనకెందుకులే అని సరిపెట్టుకుంటూ ఉంటారు. అయితే తమ ఖాతాదారులకు ఇలాంటి కష్టాల నుంచి విముక్తి కల్పించనుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఏటీఎంల ద్వారా లేదా ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల ద్వారా ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్స్ ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సర్వీసును శాలరీ ఖాతా కలిగి ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలకు ప్రీ-క్వాలిఫై అవుతారు.
ఏటీఎం ద్వారా లోన్ ఎలా పొందాలంటే:
- ముందుగా ఏటీఎంలో pre aproved loan ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి..కస్టమర్ అర్హత బట్టి వివిధ రుణాల మొత్తాలను స్క్రీన్ మీద చూపిస్తుంది.
- ఆ వెంటనే ఆటోపాపులేటెడ్ ఇంట్రెస్ట్ రేట్, ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ మొత్తాలకు ఖాతాదారు అంగీకారం తెలపాలి.
- అనంతరం స్క్రీన్ మీదకు వచ్చే బ్యాంకు నియమ, నిబంధనలను ఓకే చేయాలి.
- డెబిట్ కార్డు పిన్‌ను ఎంటర్ చేయాలి
- ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే కస్టమర్ల ఖాతాలోకి నగదు బదిలీ జరుగుతుంది.