మేనిఫెస్టో నే పార్టీ మారటానికి కారణం

 

మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి  బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.గత రెండు పర్యాయాలుగా ఎన్నికలకు సన్నద్ధం అయ్యే ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సంగారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కి టికెట్ కేటాయించింది.దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనీ నిర్ణయించుకున్న పద్మినీ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే  ఎన్నికల్లో పోటీ సాధ్యం కాదని భావించి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.బీజేపీ సంగారెడ్డి లేదా మెదక్ టికెట్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దామోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

దామోదర రాజనర్సింహ సతీమణి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నచ్చకే పార్టీ మారారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.దామోదర రాజనర్సింహ రూపొందించిన మేనిఫెస్టో ఆయన కుటుంబ సభ్యులకే నచ్చలేదని, ప్రజలకేం నచ్చుతుందని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆంధ్ర నాయకుల బానిసలుగా బతుకుతున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ మూసేస్తామంటున్నారని, ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటనా? కాంగ్రెస్‌ పార్టీ స్టాండా? స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.