అమెరికాకు భారత్ వార్నింగ్..

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ భారతీయులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. వీసాల ప్రభావం ఐటీ కంపెనీలపై బాగానే పడుతుంది. అయితే ఇప్పుడు ఆ విషయంలో భారత్ గట్టిగానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈవిషయంపై వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అమెరికా వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''కేవలం భారత కంపెనీలు మాత్రమే అమెరికాలో లేవు.. అమెరికా కంపెనీలు కూడా భారత్లో వ్యాపారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని అమెరికా అథారిటీలు దృష్టిలో ఉంచుకోవాలని మండిపడ్డారు. వారు భారీ ఎత్తున్న భారత్ మార్కెట్లో ఆదాయాలు ఆర్జిస్తున్నారు.. ఒకవేళ ఈ వీసా ఆందోళనలు ఇలానే కొనసాగిస్తే, మేము వాటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటాం. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరు వ్యవహరించాలి'' అని నిర్మలా సీతారామన్ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.