దిగొచ్చిన కేంద్రం.. జీఎస్టీలో మార్పులు...

 

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీఎస్టీ వల్ల రేట్లు తగ్గుతాయి కదా అని అనుకుంటే.. విచిత్రం ఏంటంటే.. రేట్లు ఇంకా పెరిగి.. ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వ జీఎస్టీలో కొన్ని మార్పులు చేసింది.  జీఎస్టీ లో 28 శాతం, 18  శాతం, 12 శాతం, 5 శాతం అని ఇలా నాలుగు విభాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్సెటేజ్ లను బట్టి వస్తువులను విభజించారు. 28 శాతంలో ఉన్న 178 వస్తువులను 18 శాతం శ్లాబ్ లోకి మార్చింది. 13 రకాల వస్తువులపై పన్ను 18 నుంచి 12శాతానికి, ఆరు వస్తువులపై 12 నుంచి 5 శాతానికి, ఆరు వస్తువులపై 5 నుంచి సున్నా శాతానికి టాక్స్ తగ్గించారు. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి. మరి జీఎస్టీ మార్పు వల్ల ఏ వస్తువుల రేట్లు తగ్గనున్నాయో చూద్దాం..


*28 నుండి 18 లోకి వచ్చినవి

చాక్లెట్ లు, చాక్లెట్ కోటెడ్ వేఫర్లు, చూయింగ్ గమ్, గ్లూకోజ్, లాక్టోజ్ సిరప్ లు, ఆల్కహాల్ లేని పానియాలు,  ఫేసియల్ ఐటమ్స్, ఫేస్ వాష్ లు షాంపూలు, హెయిర్ డై, హెయిర్ క్రీంలు, టూత్ పౌడర్లు, టూత్ పేస్ట్ లు, మౌత్ వాష్ లు, వాషింగ్ పౌడర్, డిటర్జెంట్, ఉన్ని దుస్తులు గ్రానైట్, మార్బుల్, కాఫీ, కస్టర్డ్ పౌడర్, వెట్ గ్రైండర్లు పాలిష్ లు, క్రీములు, రేజర్లు, బ్లేడులు కత్తిపీటలు, స్టోరేజీ వాటర్ హీటర్, బ్యాటరీలు, గాగుల్స్ చేతి వాచీలు, గోడ గడియారాలు, పరుపులు కేబుల్స్ , వైర్లు, రబ్బరు ట్యూబులు సిమెంట్ గోడలకు వేసే పెయింట్లు, ఆర్టిస్ట్ లు వాడే పెయింట్లు,వార్నీష్ లు టైర్లు, ట్యూబ్ లు,  సూట్ కేసులు సిరామిక్ టైల్స్, పైపులు, మైక్రో స్కోప్ లు రిఫ్రిజిరేటర్లు, ప్రింటర్లు, వాక్యూం క్లీనర్లు, టీవీలు కంప్యూటర్ మానిటర్ లు, ప్రొజెక్టర్ లు

* 18 నుంచి 12 శాతానికి తగ్గినవి

కండెన్సెడ్ పాలు, రిఫైండ్ చక్కెర, పాస్టా, కర్రీ పేస్ట్, మధుమేహ రోగుల ఆహారం, మెడికల్  గ్రేడ్ ఆక్సీజన్, ప్రింటింగ్ ఇంక్, హ్యాండ్ బ్యాగులు, టోపీలు, కళ్లద్దాల ఫ్రేములు, వెదురు, కేన్ ఫర్నీచర్

* 18 నుంచి 5 శాతానికి తగ్గినవి

మరమరాల ఉండలు, బంగాళదుంపల చట్నీ, చట్నీ పొడులు

* 12 నుంచి 5 శాతానికి తగ్గినవి

ఇడ్లీ, దోస తడి పిండి, కొబ్బరి పొడి,శుద్ధి చేసిన తోలు, కొబ్బరి పీచు, చేపల వలలు
 
* 5 నుంచి సున్నా శాతానికి తగ్గినవి

గోరు చిక్కుడు పదార్థాలు, ఎండు కూరగాయలు, కొబ్బరి కుడుక, చేపలు