పండ్ల రసాల సీక్రెట్

పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచిది అని తెల్సిందే కదా. అయితే పిల్లలే కాదు మనం కూడా చాలాసార్లు ఇష్టమంటూ ఏదో ఓ పండునే ఎక్కువగా తీసుకుంటూవుంటాం. అలాకాక అవసరాన్ని బట్టి శారీరక పరిస్టితిని బట్టి అప్పుడప్పుడు పళ్ళ రసాల్ని మార్చి, మార్చి తాగటం మంచిది అంటున్నారు నిపుణులు.

 

fruit juice for glowing skin, fruit juice healthy, fruit juice health benefits

ఉదాహరణకి బాగా అలసటగా ఉంటే

 

a) ఆపిల్, క్యారెట్ , కమలా రసాలు తాగితే అలసట దూరమవుతుంది. 

b)  ఒత్తిడిగా,
 
అదే బాగా ఒత్తిడిగా అనిపించినపుడు టమాటో లేదా క్యారెట్ రసాలు  తీసుకుంటే ఒత్తిడితగ్గుతుంది.


c) రక్త హీనత

 ఖర్జూరాలు , ద్రాక్షపళ్ళు  రసాలు  రక్తహీనతని తగ్గిస్తాయి.

d) రోగ నిరోధక
 
రోగ నిరోధక శక్తి పెరగటానికి ఆపిల్, నిమ్మ, క్యారెట్ , అల్లం రసాలు చక్కగా పనిచేస్తాయి.
         
e) జీర్ణశక్తికి

జీర్ణశక్తికి ఆపిల్ ,క్యారెట్ రసాలు  పైనాపిల్, పుదీనా నిమ్మ రసాలు ఎప్పుడు తీసుకున్న వెంటనే శారీరక, మానసిక అలసట ఒత్తిడిని  తగ్గించి రిలాక్స్ అయ్యేలా చేస్తాయిట.

...రమ