విద్యుత్ షాక్ తో నలుగురు మృతి

తూర్పు గోదావరి జిల్లా తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు మరణించిన ఘోర సంఘన చోటు చేసుకుంది.  మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.  

పాపన్నగైడ్ విగ్రహావిష్కరన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాదఘటన జరిగింది. మృతులను గొల్ల వీర్రాజు, నాగేంద్ర, కృష్ణ, మణికంఠగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.