శిల్పారామంలో అగ్నిప్రమాదం.. 10 షాపులు దగ్ధం..

 

హైదరాబాద్‌లోని శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శిల్పారామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఈ మంటల్లో 10 షాపులు కాలి బూడిదయ్యాయి. శిల్పారామం భద్రత సిబ్బంది స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించడంతో ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు అర్పివేశాయి. ఈ అగ్రిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.