దినకరన్ కేసులో మరో వికెట్.. చిన్నమ్మ ఆదేశం మేరకే...!
posted on Apr 28, 2017 12:00PM
.jpg)
పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే దినకరన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా పోలీసులు దినకరన్ విచారణ జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరో వికెట్ పడింది. సుఖేష్ చంద్రశేఖరన్ కు 10 కోట్ల రూపాయలు అందజేసిన హవాలా ఏజెంట్ నరేష్ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్ లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన నరేష్ ను డిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణలో దినకరన్ నుండి మరిన్ని సాక్ష్యాలే రాబడుతున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఢిల్లీ నుంచి దినకరన్ ను చెన్నై తీసుకెళ్లిన పోలీసులు దినకరన్ భార్యను ప్రశ్నించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వజూపారన్న సాక్ష్యాలు సేకరించారు. దీంతో బెంగుళూరులోని పరప్పన జైలులో ఉన్న శశికళను కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. మరి ఈకేసులో కనుక శశికళ పై ఉన్న ఆరోపణ నిజమైతే ఆమె ఇంకా సమస్యలు ఎదుర్కొక తప్పదు.