కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ గుడ్ బై!

 

కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిన్న తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫాక్స్ ద్వారా పంపారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఈయటం లేదని ఆయన ప్రధాన ఆరోపణ. ఆయన ఈనెల 6వ తేదీన తెరాస పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో బాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కె.జానారెడ్డి, దానం నాగేందర్ రెడ్డి, నందీశ్వర్ గౌడ్, విట్టల్ రావు, మాగం రంగారెడ్డి తదితరులు కూడా త్వరలో పార్టీని వీడి తెరాసలో చేరే అవకాశమున్నట్లు సమాచారం.