ఆస్ట్రేలియా నాలుగో వికెట్
posted on Mar 26, 2015 11:43AM
ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. పించ్ (81), మాక్సెల్ (23) వెంటవెంటనే ఔటయ్యారు. అంతకుముందు సెంచరీ చేసిన స్టీవెన్ స్మిత్ 105 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో భారత క్రీడాకారులలో, ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా గురువారం సిడ్నీలో భారత - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 38 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 233 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ చేశాడు. ఆయన తన సెంచరీని కేవలం 89 బాల్స్‌లో చేయడం విశేషం. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు వున్నాయి. ఇది ప్రపంచ కప్‌లో స్టీవెన్‌కి మొదటి సెంచరీ. ఆట మొదట్లోనే ఒక వికెట్ పోవడంతో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత నిలదొక్కుకుని పరుగుల వర్షం కరిపిస్తోంది. ఇప్పుడు రెండో వికెట్ పడటంతో ఆస్ట్రేలియా మళ్ళీ ఆచితూచి ఆడుతోంది. అయినప్పటికీ భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసింది.