అయోమయంలో సీపీఐ పార్టీ నేతలు!!

 

హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ప్రారంభం కావడం కంటే ముందే హుజూర్ నగర్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. సీపీఐ మద్దతు ప్రకటించిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. అన్ని విపక్షాలు కలిసి ఆర్టీసీ జేఏసీకి మద్దతు నిచ్చాయి. కానీ ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీపీఐ సందిగ్ధంలో పడింది. హుజూర్ నగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సిపిఐ ఇప్పుడు ముందుకా వెనక్కా అని ఆలోచనలో పడింది. ఇప్పటికే పునరాలోచిస్తామని ప్రకటించిన సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.. ఇవాళ రాష్ట్ర పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే గనక మద్దతు ఉపసంహరించుకోవాల్సి వస్తుందని కమిటీ నేతలందరూ ఉత్తర్వులు జారీ చేశారు.మొన్న జరిగినటువంటి ఒక అఖిల పక్ష సమావేశంలో ఆర్టీసీ జెఏసి నాయకులంతా కూడా ఆర్టీసి కార్మికులు చేసినటువుంటి సమ్మెకు సంఘీభావంగా ఇతర విపక్ష పార్టీలు అన్నింటినీ కూడగట్టుకొని సమ్మెకు దిగుతున్నటువంటి తరుణంలో సిపిఐ పార్టీ వైఖరి కూడా చెప్పాలని చెప్పి వాళ్లంతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.