ఈస్టర్న్ మసాలా దినుసుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...

వంటలు ఘుమఘుమల అంటే ముందుగా మనకు గుర్తోచ్చేది మసాలా దినుసులు. అలంటి ఒక ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ కు నిప్పు రాజేసుకుంది. భారత్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని తేనీ జిల్లా కొడంగల్ పటిలోని ఓ మసాలా దినుసుల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా మొదలైన పొగలు, కొద్ది సేపట్లోనే దావానలంలా వ్యాపించాయి. ఈస్టరన్ కంపెనీకి చెందిన మసాలా మేకింగ్ ఫ్యాక్టరీగా అధికారులు తెలియజేశారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఐదు ఫైరింజన్ లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేరని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది దాదాపు రెండు కోట్ల రూపాయల మసాలా దినుసులు కాలి బూడదైనట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. 

అగ్నిప్రమాదంలో చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి.అగ్నిప్రమాదం సంభంవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఏ కార్మికులు లేకపోవడం పై తీవ్ర అనుమానాలు వెల్లడవుతున్నాయి. అసలు అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు ఏమై ఉండవచ్చని పోలీసులు విచారించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఆ లేక ఇతర్త్న కారణాలా లేక యాజమాన్యం చర్యలా అనే అనుమానాలు దర్యాప్తు లో తేలాల్సిన అంశాలు. మొత్తానికి ఫ్యాక్టరీ సిబ్బందికి భారీ నష్టాన్ని తెచ్చి పెట్టినా ప్రాణ హాని ఏమి జరగక పోవడంతో ఊపిరి పీల్చున్నారు యజమానులు. ఇక ఈ దర్యప్తును పోలీసులు వీలైనంత త్వరలో విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు బాధితులు.