సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం 

కరోన వైరస్ కి మూలకారణము కేతు గ్రహమనీ, సూర్యుని మేష సంక్రమణంతో, ఈ నెల 13 తర్వాత కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందనీ జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెపుతున్నారు. వాస్తవానికి -సూర్యుడు తులారాశినుండి వృశ్చిక రాశికి ప్రవేశించే కాలములో  ఈవైరెస్ జన్మించింది.అంటే, నిరుడు సెప్టేంబర్ అక్టోబర్ కాలములో జన్మించింది.కాని దానియొక్క తీవ్రత ఎవరికి తెలియలేదు. ఈ వైరస్ యొక్క తీవ్రత డిసెంబర్ 26 వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఆనగా ఆరు గ్రహాలు గురువు , శని, కేతువు, సూర్యుడు,చంద్రుడు, బుధుడు తో కూడుకున్నటువంటి ఆరుగ్రహాల కూటమి ధనుర్ రాశిలో ఏర్పడటము జరిగింది.ఈ షష్ఠగ్రహ కూటమి చాలా సాధారణముగా ఎప్పుడు జరగదు.ఈ షష్ఠగ్రహ కూటమి  ప్రపంచ వినాశనాన్ని సూచిస్తుంది.కాని ఒక వైరెస్ ద్వార ప్రపంచ వినాశనము జరుగుతుందని ఎవరు ఊహించలేక పోయారు.ఈ షష్ఠగ్రహ కూటమి ద్వార ఏర్పడిన వైరస్ క్రమముగా పెరుగుతూవచ్చింది. ఈ షష్ఠగ్రహ కూటమి నుండి చంద్రుడు త్వరగా  బయటకు వెల్లడము వలన పంచగ్రహ కూటమి ఏర్పడింది.

నిరుడు డిసెంబర్ 31 వ తేదీన చైన కరోన వైరెస్ మాదేశానికి వ్యాపించిందని మొట్టమొదటి సారి ప్రపంచానికి తెలియచెప్పింది. ఆరోజు గ్రహస్థితి రాహువు ఆర్ద్రా నక్షత్రము మిథునములో ఉన్నారు. చంద్రుడు కుంభంలో ఉన్నారు శుక్రుడు మకరం లో ఉన్నారు.. ధనస్సురాశిలో గురువు శని కేతువు సూర్యుడు బుధుడు ఐదు గ్రహాలు కలసి వున్నాయి.ఈపంచగ్రహ కూటమి డిసెంబర్ లో జరిగింది.

జనవరి 11 వ తేదీన చైనా తన దేశములో కరోన వైరెస్ తో మరణము సంభవించిందని తెలియజేసింది. జనవరి 23 వ తేదీన చంద్రుడు బుధుడు, శని సూర్యుడు ధనస్సురాశి నుండి మకరరాశి లోకి ప్రవేశించాయి.  గురువు కేతువు ధనస్సు రాశిలో మిగిలి పోయాఋ. . ఈ గురువు కేతువు కలయిక వలన  ఈ వైరస్ ప్రపంచవ్యాప్తమయిపోయింది. గురువు మంచి గ్రహము అయినప్పటికి, కేతువు కలయిక వలన ఈవైరెస్ ప్రపంచమంతా తెలిసింది.దీనితో పాటు శని సూర్య కలయిక వలన మృత్యుప్రళయము మొదలయింది.దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవిడ్ 19 అనే పేరుని సూచించింది. శని సూర్యులు వైర గ్రహాలు. ఫిబ్రవరి 8 వ తేదీన కుజ కేతు గురు కలయిక వలన ఈ వైరెస్ ప్రపంచమంత పెనుదుమారముగా మారింది.గురువు కేతువులతో కుజుడు కలవడము వలన కుజగ్రహ కలయిక ప్రభావముతో ప్రపంచమంతా భీభత్సముగా మారింది. ఫిబ్రవరి 18 వ తేది నుండి మార్చి 5 వ తేది మద్యలో రాహువు కేతువు మధ్యలో సప్తమ గ్రహాలు చేరి  కాలసర్ప దోషం ఏర్పడింది.మండుతున్న నిప్పులో ఆజ్యం పోసినట్టుఅయింది.కాలసర్పస్థితి ప్రపంచమంతా ఏర్పడింది.ఈ మధ్య కాలములో మానవాళికి ఉపయోగపడే శుభగ్రహాలు వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది. మంచి చేసే గ్రహాస్థితులు కాలసర్ప దోషం వలన వాటి ప్రభావాన్ని కోల్పోవడము జరిగింది.దీని ప్రభావము వలన ప్రపంచమంతా లాక్ డౌన్ ప్రకటించింది.జనజీవనము స్తంభించడమూ జరిగింది .భారతదేశము ఆధ్యాత్మిక దేశమయినందున,  భగవద్ ఆనుగ్రహము వలన దీనిప్రభావము తక్కువగా ఉంది.

ఈ యొక్క కరోన వైరెస్ జ్యోతీష్య శాస్త్ర ప్రకారము తగ్గుముఖం పట్టేది ఎప్పుడంటే, మార్చి 24 నాడు ఉగాది ఈ ఉగాది గ్రహస్థితులు గురువు కేతువు ధనస్సురాశిలోనే వున్నారు. కుజుడు గురువుకేతువులను వదిలిపెట్టి మఖరరాశిలోకి ప్రవేశిస్తున్నారు.సూర్యుడు కూడ మారడము వలన మృత్యువు అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది.కుజుడు గురుకేతువులను వదిలిపెట్టడము వలన దీని ప్రభావము కొంత తగ్గుముఖం పడుతుంది.కాని పూర్తిగా తగ్గదు.కాని కొంత ప్రశాంతతను ఇస్తుంది.

మార్చి 30 వ తేదీన కేతువుని గురువు కూడ వదిలిపెట్టడము వలన  కేతువు ఒంటరివాడు అవుతాడు. దీనివలన గ్రహ స్థితులు అన్ని అనుకూలముగా మారుతాయి.దీనివలన జనాలలో అవగాహన పెరగడము, కొద్దికొద్దిగా ఈ వైరెస్ తగ్గడము, భయాందోళనలు తగ్గుముఖం పడతాయి. కాని పూర్తిగా నిర్మూలన కాదు. ఈ వైరెస్ గురించి పూర్తిగా భయాందోళనలు తగ్గాలంటే ఏప్రిల్  13వ తేదీ వరకూ ఆగవలసిందే. దీని వల్ల సూర్యగ్రహం మీనరాశి నుండి మేషసంక్రమణము చెందుతుంది. ఫలితంగా సూర్యగ్రహం బలపడి వ్యాధులన్నీ  దూరమయి ఆ సమయానికల్లా  మందులు అందుబాటులోకి వచ్చి ఈ వైరెస్ తగ్గుముఖం పడుతుంది. మామూలు పరిస్థితులు వస్తాయని జ్యోతిష్యుల లెక్క. ఆ శుభ  సమయం కోసం వేచి చూద్దాం.