నేడు టీడీపీలోకి మాజీ మంత్రి

 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా మహ్మద్‌ సయ్యద్‌ తెలుగుదేశం పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈరోజు ఏపీ సీఎం,తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. అహ్మదుల్లా కడప నగరానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రహంతుల్లా తనయుడు. రహంతుల్లా నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాన అనుచరుడు. 1976-82 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన తనయుడిగా 2000లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన అహ్మదుల్లా మొదట మున్సిపల్‌ చైౖర్మన్‌గా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున కడప అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ గెలుపొంది వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఓ సారి చంద్రబాబుతో భేటీ అయిన అహ్మదుల్లా.. కడప సిటీ అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. కడప నియోజకవర్గంలో 1994 నుంచి ముస్లిం అభ్యర్థులనే ప్రజలు గెలిపిస్తున్నారు. దీంతో టీడీపీ కూడా అహ్మదుల్లాకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.