ఏపీ, సింగపూర్ మద్య కీలక ఒప్పందం..
posted on May 15, 2017 12:15PM

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ తో సింగపూర్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూలో భాగంగా ఏపీ ప్రభుత్వం సింగపూర్‌కు 1691 ఎకరాలు అందజేయనుంది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్ ప్రాంతాన్ని సింగపూర్ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి అభివృద్థిలో సింగపూర్ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ మాదిరిగా నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని...అమరావతి అభివృద్ధికి సింగపూర్ కేవలం 6 నెలల్లోనే బృహత్తర ప్రణాళిక ఇచ్చిందన్నారు.