చంద్రబాబు ఇల్లు.. ఏసీబీ కానిస్టేబుళ్ల ఓవరాక్షన్

 

తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చేసిన ఓవరాక్షన్ కు ఏసీబీ అధికారి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ నుండి రహస్యంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. దీంతో కానిస్టేబుళ్లపై సీఎం సీఎస్‌వో ఆగ్రహం వ్యక్తం చేసి.. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తెలంగాణ ఏసీబీ ఉన్నతాధికారి క్షమాపణ చెప్పారు.

 

మరోవైపు ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడని అందుకే విచారణ చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.