మహారాష్ట్రకు కాబోయే కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు : బాబు

 

మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎంపికయిన దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోనులో అభినందించారు. ఫడ్నవీస్ మహారాష్ట్రకు తోలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఈ నెల 31న ముంబైలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మిత్రపక్షమయిన బీజేపీకి చెందిన ఫెడ్నవీస్ పొరుగు రాష్ట్రామయిన మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నందున చంద్రబాబు స్వయంగా ఆయనకు ఫోనుచేసి అభినందించారు. ఫోన్ చేసి అభినందించినందుకు ఫెడ్నవీస్ కూడా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.