మేయర్ హత్య కేసు: చింటూ లొంగుబాటు

 

చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ ఈ రోజు చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. మేయర్ హత్య కేసులో పోలీసులు చింటూను ఏ1 నిందితుడిగా చేర్చారు. హత్య తరువాత ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయినచింటూ పోలీసులు ఎంత వెతికిన దొరకలేదు. అతను విదేశాలకు పారిపోతాడనే అనుమానంతో పోలీసులు అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతని బ్యాంకు లావాదేవీలు సీజ్ చేశారు. కదలికల పైన కన్నేశారు. అతనికి ఎవరి నుంచి ఆర్థిక సాయం అందకుండా పోలీసులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చిత్తూరు జిల్లా కోర్టులో చింటూ లొంగిపోయాడు.