సీఎం చంద్రబాబు ఇంటి వద్ద కొండచిలువ

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్ద కొండచిలువ కలకలం సృష్టించింది. శనివారం సాయంత్రం సీఎం నివాసం వద్ద బీబీ-1 ఎదురుగా ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పక్కనే ఒక కొండచిలువ కనిపించింది. సకాలంలో స్పందించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై రాళ్ళతో కొట్టేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మునగతోటలోకి వెళ్లిపోయింది. దీంతో దాని కోసం వెతగ్గా..మళ్లీ కొద్దిసేపటి తర్వాత కనిపించడంతో దానిని సిబ్బంది తోటల వైపు వెళ్లగొట్టారు.