కత్తులతో వీరంగం... స్టూడెంట్స్ అరెస్ట్..

 

చెన్నైలో రైల్వే స్టేషన్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు చేతుల్లో కత్తులు పట్టుకొని వీరంగ సృష్టించారు. ఇక ఈ వీడియో కాస్త తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. వివరాల ప్రకారం... చెన్నైలోని లోకల్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు చేతుల్లో కత్తులు, రాడ్లు పట్టుకుని హల్‌చల్‌ చేశారు. ఒక చేత్తో రైలును పట్టుకుని వేలాడుతూ.. మరో చేత్తో కత్తులను తిప్పుతూ వీరంగం సృష్టించారు. రైలు దిగిన తర్వాత కూడా స్టేషన్లో బాణసంచా పేల్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో చూసిన పోలీసులు నలుగురు యువకులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు యువకులను ప్రశ్నిస్తున్నామన్నారు. వీరంతా ఓ ప్రభుత్వ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించామని తెలిపారు.