ఫుడ్‌ రుచిగా ఉండాలంటే... ఇలా ట్రై చేయండి !! 

 


ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఎప్పుడూ అదే ఫుడ్‌ అంటే బోర్‌ కొట్టక మానదు. అలాగని ప్రతిసారీ కొత్తరకం ఫుడ్‌ని ట్రై చేయలేం కదా! అందుకనే ఓ చిట్కా కనిపెట్టారు పరిశోధకులు. తినే ఆహారాన్ని మార్చలేకపోవచ్చు. కానీ ఆ ఆహారాన్ని తినే పద్ధతిని మారిస్తే ఎలా ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఆ పరిశోధన ఇదిగో...

 

అమెరికాలోని ఒహియో స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్‌పరిమెంట్‌ చేశారు. దీనికోసం వాళ్లు ఓ 68 మందిని ఎంచుకున్నారు. వాళ్లలో సగం మందిని ఎప్పటిలాగే చేతుల్తో పాప్‌కార్న్ తినమని చెప్పారు. మరికొందరినేమో వెరైటీగా chop sticksతో తినమని సూచించారు. ఇలా తిన్నవారు పాప్‌కార్న్‌ ఎప్పుడూ లేనంత రుచిగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

 

ఈ ఎక్స్‌పరిమెంట్‌ ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు, ఈసారి 300 మందికి ఆన్‌లైన్లో ఒక పని అప్పచెప్పారుట పరిశోధకులు. ‘మీరు కాస్త వెరైటీగా నీళ్లు తాగి చూడమని వాళ్లకి చెప్పార’ట. దాంతో జనం రకరకాలుగా ఈ ప్రయోగాన్ని ట్రై చేశారు. కొంతమంది మందు గ్లాసులో నీళ్లు పోసుకుని తాగితే, కొంతమంది నాలుకతో చప్పరించారు. ఇలా చేసినవాళ్లంతా కూడా నీళ్లు ఎప్పుడూ లేనంత రుచిగా ఉన్నాయని చెప్పారు.

 

ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసా! మనం ఏదన్నా ఆహారాన్ని వెరైటీగా ట్రై చేసినప్పుడు, దాన్ని మొదటిసారి తింటున్న ఫీలింగ్‌ కలుగుతుందట. అందుకనే మనం దాని టేస్ట్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతాం. పిల్లలతో వాళ్లకి ఇష్టం లేని ఫుడ్‌ తినిపించడానికైనా, మనం తినే ఫుడ్‌ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలన్నా ఈ చిట్కా పాటించి చూడమంటున్నారు పరిశోధకులు.

- Nirjara

 

Related Segment News