ఎమ్మెల్సీ ఫలితాలపై జగన్... ఇదీ ఓ గెలుపేనా?

 

ఏపీ స్థానిక సంస్థల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూల్, కడప, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల విజయంపై మాట్లాడిన వైసీపీ జగన్ ఎప్పటిలాగానే టీడీపీ పై విమర్శలు చేశారు. తమ ఓట్లన్నీ కొనుగోలు చేసిన చంద్రబాబు సాధించిన విజయం అనైతికమని, ఇదీ ఓ గెలుపేనా? అని ఆయన ప్రశ్నించారు. ఓట్ల కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరిపోయారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తే, అధికార బలంతో ఓట్లను కొనుగోలు చశారని జగన్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని, తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయిన ఎంతో మంది ఎంపీటీసీలు, జడ్ పీటీసీలు తమ అభ్యర్థులకు ఓట్లు వేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావని అన్నారు.