జగన్ తో పాటు మోడీని కూడా ఏసుకున్నారుగా...!

 

ఎప్పుడూ సహనంగా ఉండే చంద్రబాబుకు కోపం వచ్చినట్టుంది. అందుకే అసెంబ్లీలో మోడీ నుండి మొదలు పెట్ట జగన్, విజసాయిరెడ్డిన ఏకిపారేశారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు చంద్రబాబు మోడీపై ఒకింత అసహనంతో ఉన్నారు. అంతేకాదు బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు పొత్తుకు సిద్దంగా ఉన్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వీటిపై స్పందించిన చంద్రబాబు.. వైసీపీ తో మాకు పొత్తు లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంటున్నారు సరే.. మరి ఏ1, ఏ2 లు ప్రధానమంత్రి దగ్గరకు ఎందుకు వెళుతున్నారు.. అసలు ఆర్దిక నేరగాళ్లు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అంతేకాదు... ఇదే విషయాన్ని నేను ప్రధానినే అడిగాను అని కూడా అన్నారు. బీజేపీ తో మిత్రపక్షంగా ఉన్న నాకే రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరిని ఎన్నుకున్నారో తెలియలేదు.. కానీ నాకంటే ముందుగానే వైసీపీ నేతలకు ఎలా తెలిసింది..? బీహార్ గవర్నర్ గా కోవింద్ దగ్గరకు విజయసాయిరెడ్డి అందరికంటే ముందు వెళ్లి అభినందనలు ఎలా చెప్పారు.. ఆ తరువాత ఎప్పటికో నాకు తెలిసింది.. ఆహా ఎంత పవర్ లాబీయింగ్ అని సెటైర్ వేశారు.

 

ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాటం చేస్తుంటే... మరోపక్క మోడీపై నమ్మకం ఉంది.. మోడీ ప్రత్యేక హోదా ఇస్తారని అంటారు.. ఏపీ ప్రత్యేక హోదాపై బీజేపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు... అలాంటిది.. వైసీపీకి అంత నమ్మకం ఎలా ఉంది... అవిశ్వాస తీర్మానం పెడతామంటారు.. దానికి మా మద్దతు కావాలంటారు.. ఇలాంటి కుట్రలతో ప్రజలను మోసం చేయలేరు.. కుట్రలు చేసేవారు శాశ్వతంగా నష్టపోతారు అని అన్నారు. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు... అటు జగన్ ను తిడుతూనే... ఇన్ డైరెక్ట్ గా మోడీకి కూడా బాగానే సెటైర్ వేసినట్టు ఉంది చంద్రబాబు.