రూ 2000 నోట్లు సీజ్ చేసిన పోలీసుల మైండ్ బ్లాక్!!

 

 

దాదాపు రెండేళ్ల క్రితం ప్రధాని మోడీ రూ 1000, 500 నోట్లు బాన్ చేస్తున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఐతే దీనికి ఆయన చెప్పిన ఒక కారణం దొంగ నోట్ల చెలామణి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూ 2000 నోట్లను ప్రవేశ పెట్టింది.  ఈ నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువని వీటికి నకిలీలు తయారు చేయడం కష్టమని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. ఐతే ఈ రూ 2000 నోట్లకు కూడా నకిలీలు తయారు చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక పోలీసులు ఇటువంటి నకిలీ నోట్లను పట్టుకున్నారు. ఐతే వాటి విలువ ఎంతో తెలుసా అక్షరాలా 300 కోట్లు. ఏంటి షాక్ తిన్నారా.. మీరు చదివింది నిజమే. కర్ణాటక తమిళనాడు బోర్డర్ లో ఇంత పెద్ద మొత్తం నకిలీ నోట్ల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. చామరాజనగర తాలుకాలోని అట్టుగుళిపుర సమీపంలో పోలీసులు సోదాలు జరుపుతూన్న సమయంలో అటువైపుగా వచ్చిన గూడ్స్ ఆటోను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా,  పోలీసులను చూసిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఐతే పోలీసులు వెంటాడి ఆ ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. తరువాత గూడ్స్ ఆటోను పరిశీలించగా పోలీసులు మైండ్ బ్లాక్ అయింది. ఆ ఆటోలో రూ. 2, 000 నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని మరింతగా పరిశీలించగా అవి నకిలీవి అని పోలీసులు గుర్తించారు. ఐతే దీనికి సంబంధించి వివరాలు ఇంకా అందవలసి ఉంది.